Mutyala Muggu (1975)

Cast: Sridhar, Samgeetha (Lakshmi), Rao Gopala Rao, Allu Ramalingaiah, Suryakantham, Kantha Rao (Somaraju), Nutan Prasad, Mukkamala, Halam, Jayamalini, Poornima, Arja Janardana Rao, Suresh Kumar, Kakarala, Baby Radha, Master Murali, Vara Prasad
Story and Dialogues: Mullapudi Venkata Ramana
Lyrics: Arudra, Gunturu Seshendra Sharma, C. Narayana Reddy
Music: KV Mahadevan
Play-back: P. Susheela, SP Balasubrahmanyam, Ramakrishna, Mangalampalli Bala Muralikrishna
Cinematography: Ishan Arya
Producer: MVL
Director: Bapu
Banner: Srirama Chitra
Trivia: MVL (Maddali Venkata Lakshmi Narasimha Rao), the producer, was a student to C. Narayana Reddy in MA at Usmania University. He was seen in opening scenes in the movie.
This is Sangeetha's debut movie as a lead actress.
Popular Songs:
1. Gogulu pooche gogulu pooche (CNR)
2. Entati rasikudavo teliseraa (CNR)
3. Edo edo annadi ee masaka veluturu (Arudra)
4. Nidurinche thotaloki paata okati vachchindi (Seshendra)

Comments

Anonymous said…
సహస్రాబ్ది దార్శనిక కవి
కవిర్విశ్వో మహాతేజా
గుంటూరు శేషేంద్ర శర్మ
Visionary Poet of the Millennium
http://seshendrasharma.weebly.com/

జననం 1927 అక్టోబరు 20 నాగరాజపాడు, నెల్లూరుజిల్లా

మరణం 2007 మే 30 (వయసు 79) హైదరాబాదు

తండ్రి సుబ్రహ్మణ్య శర్మ ( 15 -05 – 1896 -27-07-1966)
తల్లి అమ్మాయమ్మ ( DOB - 19 – 02 – 1980 )
భార్య / వివాహం : 26 -03 – 1945
జానకి
పిల్లలు

విద్యాభ్యాసం

ఉద్యోగం:
వసుంధర; రేవతి (కూతుర్లు);
వనమాలి; సాత్యకి (కొడుకులు)
బి.ఏ (ఏ.సి. కాలేజ్ , గుంటూరు ,)
లా (బి .ఎల్ , మద్రాస్ లా కాలేజ్ , మ మద్రాస్ స్ )
డిప్యూటీ మునిసిపల్ కమిషనర్
(మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ (37 సంవత్సరాలు)

ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం.
అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ..
ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం.
ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి
నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా
ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం.
ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర.
అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ……….
– ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)

* * *

పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.
యువ నుంచి యువ దాకా కవితా సంకలనం)
అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999

------------
ఆంధ్ర భువిని అత్యున్నతంబైనయట్టి
శిఖరముల నిల్చి ఇరువు రర్చింపబడెడి _
ఏడు కొండలన్ " శ్రీవేంకటేశు " డొకడు !
సాహితీ గిరిన్ " శేషేంద్ర శర్మ " యొకడు !!
- డా.ఆచార్య ఫణీంద్ర
-------------
కత్తులుగా మొలిచిన శేషేంద్ర మాటలు మానవత్వం పరిమళించే తోటలై,
యువశక్తిని నవయుగం వైపుకు నడిపించే బాటలై,
సారస్వత విలువలను సంరక్షించే దుర్భేద్యమైన కోటలై
ఈ శతాబ్ది చైతన్య స్రవంతిలో అంతర్లీనమయ్యాయి.
ఇదీ శేషేంద్ర సంకల్పం.
ఇదీ శేషేంద్ర స్వామ్యవాద సాహిత్య శిల్పం………”
-----
అక్టోబర్ తర్వాత విప్లవంతో పెనవేసుకున్న మరో నెల మే . అదే మే డే ! కాకతాళీయంగా శేషేంద్ర నిర్యాణం మే నెలలోనే.
అలా జనన మరణాలను అనూహ్యంగా
విప్లవంతో అనుసంధానం చేసుకున్న కాలజ్ఞులు శేషేంద్ర..
- -- డా.వెనిగళ్ళ రాంబాబు
- సినీ గీత రచయిత
-

"ఎన్నో కలల్ని పద్యాల నౌకల్లో తెచ్చి
మీ తీరాలకు చేర్చాను
నా వాక్యాలు
తీగెలుగా బిగించి
నన్ను వాద్యాన్ని చేసుకున్నాను
నన్నొక రేవు చేరనీండి
నా స్వర్గాలన్నీ ఇక్కడే కుమ్మరిస్తా”(శేషేంద్ర చమత్కారికలు, 121).
సృజనశక్తి, విమర్శనశక్తి, పరిశోధనశక్తి ఒకే వ్యక్తిలో ఉండడం చాలా అరుదు. లోకంలో రంగులన్నీ మింగి పక్షిలా ఎగిరిపోయిన విశిష్ట కవి శేషేంద్రశర్మ. ప్రతిభ, పాండిత్యం, అభ్యాసం కావ్యసృష్టికి అవసరమన్న ఆలోచనని అక్షరాలా నిజం చేసిన అసాధారణ సాహితీవేత్త గుంటూరు శేషేంద్ర శర్మ.
-------------
అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర

ఆచార్య పేర్వారం జగన్నాథం
సంపాదకుడు
అభ్యుదయ కవిత్వ్యానంతర ధోరణులు,
(ప్రచురణ 1987)
మాజీ వైస్ ఛాన్సలర్,
తెలుగు యూనివర్సిటీ)
Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com

Anonymous said…
ఒకే ఒక్క సినిమా పాట కథ
చిత్రం - ముత్యాల ముగ్గు (1975)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - గుంటూరు శేషేంద్ర శర్మ
గానం - P.సుశీల
-----------
సాత్యకి
S/o గుంటూరు శేషేంద్ర శర్మ
http://seshendrasharma.weebly.com
saatyaki@gmail.com
1974 అక్టోబరు ప్రాంతంలో బాపు, రమణ, ముత్యాల ముగ్గు నిర్మాత సుకుమార్, ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఎంవియల్ వెళ్ళి గ్యాస్ట్బాగ్ ప్యాలస్ లో సినిమా షూటింగ్ కావాలని అడిగారు. నాన్న చేత పాటలు రాయించాలని ఇందిరా ధనా రాజర్ అడిగింది. పాటల రికార్డింగ్ పూర్తయ్యిందని, ఒక్క పాట ఇవ్వడానికి ప్రయత్నిస్తామనీ, ముందు తీయబోయే | సినిమాల్లో ఎక్కువ పాటలు రాయిస్తామనీ వాళ్ళన్నారు. ఆ ఒక్క పాట రాయడానికి మద్రాస్ | రమ్మన్నారు. 1974 డిసంబర్ ఆఖరి వారంలో మద్రాస్ వెళ్ళాడు. రెండు రోజుల్లో తిరిగొస్తానని వెళ్ళిన మనిషి జనవరి 1975 మొదటి వారంలో తిరిగొచ్చాడు. సంగతేమిటంటే మద్రాస్ | చేరుకోగానే శ్రీలంకకు సంబంధించిన వైరల్ జ్వరం వచ్చిందట. 104, 105 డిగ్రీలు ఉండే దట. సినిమా వాళ్ళు ఎవరో డాక్టర్ని సవేరా హోటల్కు తీసుకొచ్చి ఇంజక్షన్లు పొడిపించారట. ఆ జ్వరంలోనే పాట రాశాడు. ఈ పాట అప్పుడు ఆ సినిమా కోసం రాసింది. అందులో ఒక్క | ముక్కయినా అంతకు పూర్వం లేదు.
సంగీత దర్శకుడు కె.వి.మహదేవను హోటల్కు తీసుకువచ్చారట. పాటలో మార్పులు ఏమయినా చేయాలా అని నాన్న ఆయన్ని అడిగాడట. పాటలోనే రాగం ఉందని, దాన్ని ఉన్నది ఉన్నట్టు పాడించేయడమేననీ, రికార్డింగ్ కి ఉండనవసరంలేదని మహదేవన్ చెప్పాడట. | హైదరాబాద్ తిరిగొచ్చేశాడు. ఫిబ్రవరిలో షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తూ వస్తూ రికార్డ్ చేసిన పాటను వాళ్ళు తెచ్చి వినిపించారు. నాకు గుర్తున్నంత వరకూ గోదావరి ప్రాంతంలో ఆ పాట షూటింగ్ అప్పుడు నాన్న రాజమండ్రి ఏప్రిల్ నెలలో వెళ్ళాడు. చివరకు సినిమాలో కూడా పాట ఉంది. 1975 లోనే హైదరాబాద్ సుదర్శన్ టాకీస్ లో జరిగిన ము. ము. శతదినోత్సవాన్నికి నాన్నను పిలిచారు వేదిక మీద అక్కినేని నాగేశ్వర రావు తో ప త కం ఇప్పించారు /////// సీతాకళ్యాణంలో మూడు పాటలు రాయిస్తామన్నారు. చివరకు రెండన్నారు. తీరా మద్రాస్ చేరుకున్నాక ఒకటన్నారు. చివరికి ఆ ఒకటి కూడా తీసేశారు. 1976 జనవరి మొదటి వారం లో వాళ్ళు పిలవగా మద్రాస్ వెళ్ళాడు . మూడు పాటలన్నవాళ్ళు చివరకు ఒక పాట రాయమన్నారు . సీత బాల్య క్రీడల పాట రాయమన్నారు రాసి ఇచ్చ్చి హైదరాబాద్ తిరిగి వచ్చ్చేసాడు . 1976 ఫిబ్రవరి మొదటివారం లో నాన్న నేను మచిలీపట్నం వెళుతూ రాత్రి కావస్తుండగా బెజవాడ మనోరమా హోటల్ లో దిగాం . అనుకోకుండా ము.ము. నిర్మాత ఎంవిఎల్ అక్కడే ఉన్నాడు . నాన్నను తన గదికి వెంటతీసుకెళ్లాడు . నాన్న 11 తర్వాత మా రూమ్ తిరిగివచ్చాడు . గదిలోకి అడుగుపెడుతూనే \' పాట తీసేశారట రా " అన్న్నాడు ఇది కథ. ఆ తర్వాత ము.ము. నిర్మాత సుకుమార్, ఎంవియల్ ఏవో కాగితాల మీద ఇ.ధ సంతకాలు కావాలని అడగటానికి వెళ్ళారట. వాళ్ళ ముందు బాపు, రమణలను ఇ.ధ పచ్చి సంకృత దూషణలతో దనుమాడిందట. ఆ దనుముకు నాన్న కూడా అడపాదడపా దరువేశాడట. అప్పటినుంచీ ఇరువర్గాల మద్య వైరం ఏర్పడ్డది. బాపు, రమణల్లో ఒకరి భార్య ఆంధ్రజ్యోతి ఎడిటర్ చెల్లెలట. అప్పటినుంచీ ఆ పత్రికలో నాన్న మీద వ్యంగ్య రచనలు | రావడం మొదలయ్యింది. మిథునం సినిమా కథారచయిత శ్రీరమణ ఆంధ్ర జ్యోతి లో ఉండేవాడు. ఎప్పుడూ నాన్నా మీద దొంగ పేర్ల తో జిగుప్సకరమైన రాతలు రాసేవాడు ఈ నాటికీ బాపు, రమణ వర్గీయులు నాన్న మీద విషం ఊస్తుంటారు.
-------
యాభై వసంతాల ముత్యాల ముగ్గు
“…నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది.. రాసింది గుంటూరు శేషేంద్ర శర్మ, పాడింది సుశీల. శేషేంద్ర శర్మ రాసిన ఒకేఒక సినిమా పాట ఇది. తెలుగు సాహితీ రంగంలో మేరునగం అనిపించుకున్న ఆయన.. ఒకే ఒక్క సినిమా పాటతోనూ అంతే ఖ్యాతిని పొందారు. శ్రద్ధగా వింటే సినిమా కథంతా ఈ ఒక్కపాటలో ప్రతిధ్వనిస్తుంది…….:

July 20, 2025
-------

Popular posts from this blog

Kondaveeti Rowdy (1990)

Illu Illalu (1972)