Rangeli Raja (1971)




Cast:
Akkineni Nageswara Rao
Lyrics: C. Narayana Reddy
Music: Ghantasala
Play-back: Ghantasala
Producers: Lakshmi Rajyam, Sridhar Rao
Director: CS Rao
Banner: Rajyam Productions
Popular Songs:
1. Vidyarthulu nava samaja nirmataluraa (CNR)

Comments

Nrahamthulla said…
విద్యార్ధులు నవసమాజ నిర్మాతలురా
విద్యార్ధులు దేశ భావి నిర్ణేతలురా
వినోదాలు చూపినా విప్లవాలు రేపినా
అన్నిటికీ పైచేయి యువతరానిదే
ప్రగతి ఆగిపోవు విద్యార్ధులు ముందు లేనిదే

బుక్స్ బుక్స్ బ్లడీ బుక్స్
లుక్స్ లుక్స్ ప్రెటీ లుక్స్
కారిడార్లో కాసేపు కేంటీన్లో కాసేపు
గర్ల్ ఫ్రండ్స్ తో కాసేపు తిరిగేదే స్టూడెంట్ లైఫ్
గంటలకొద్దీ క్లాస్ రూములో
అంటుకుపోతే ఇరకాటం
ఎపుడో వచ్చే పరీక్షకోసం
ఇపుడే ఎందుకు జంజాటం

చదువేనా ఆహారం
చదువేనా పానీయం
విద్యాదాత నా దైవం
విద్యాలయం నాదేవాలయం

సంఘంతో ముడి లేదు
సమ్మెలతో పనిలేదు
మీటింగులంటే అమ్మో భయం
పాఠాలంటే మహా ప్రియం

సహనం నా కవచం
శాంతం నాకిష్టం
అహింసయే మనజాతికి అందిన పరమార్ధం
ఒక చెంపను కొడితే ఇంకొక చెంపను చూపాలి
సర్వోదయ మార్గంలో సమతను సాధించాలి

ఇది కుళ్ళిన సంఘం వయసు మళ్ళిన సంఘం
దీని కీళ్ళు విరిచి వేయాలి వేళ్ళు నరికి వేయాలి
పెన్ను విడిచి పెట్టి గన్ను చేతపట్టి
పెత్తందారుల
పచ్చి నెత్తురులో కొత్త జగతి పుట్టాలి

చదువులంటే పెదవి విరిచే సరదాజీవి ఒకడు
పుస్తకమే సమస్తమనే చాదస్తపు యువకుడు ఒకడు
వల్లమాలిన సౌజన్యంతో చల్లారిన వాడొకడు
ఉద్యోగంలో ఉనికిని మరచిన ఉగ్రవాది ఇంకొకడు

నలుగురిలో కలవు కొన్ని లోపాలు
నలుగురిలో కలవు ఎన్నో సుగుణాలు
ఈ నలుగురి సుగుణాలు ఏకమైన నాడు
ఆదర్శ విద్యార్ధి అవతరించుతాడు
అతడే మన దేశానికి ఆశాదీపం
విశ్వ శాంతికొసగునోయి అభినవరూపం
అతడు శాంతికొసగునోయి అభినవరూపం

--- సినారె,ఘంటసాల,రంగేళీ రాజా (1971)

Popular posts from this blog

Kondaveeti Rowdy (1990)

Illu Illalu (1972)

Malle Moggalu (1986)