విద్యార్ధులు నవసమాజ నిర్మాతలురా విద్యార్ధులు దేశ భావి నిర్ణేతలురా వినోదాలు చూపినా విప్లవాలు రేపినా అన్నిటికీ పైచేయి యువతరానిదే ప్రగతి ఆగిపోవు విద్యార్ధులు ముందు లేనిదే
బుక్స్ బుక్స్ బ్లడీ బుక్స్ లుక్స్ లుక్స్ ప్రెటీ లుక్స్ కారిడార్లో కాసేపు కేంటీన్లో కాసేపు గర్ల్ ఫ్రండ్స్ తో కాసేపు తిరిగేదే స్టూడెంట్ లైఫ్ గంటలకొద్దీ క్లాస్ రూములో అంటుకుపోతే ఇరకాటం ఎపుడో వచ్చే పరీక్షకోసం ఇపుడే ఎందుకు జంజాటం
చదువేనా ఆహారం చదువేనా పానీయం విద్యాదాత నా దైవం విద్యాలయం నాదేవాలయం
సంఘంతో ముడి లేదు సమ్మెలతో పనిలేదు మీటింగులంటే అమ్మో భయం పాఠాలంటే మహా ప్రియం
సహనం నా కవచం శాంతం నాకిష్టం అహింసయే మనజాతికి అందిన పరమార్ధం ఒక చెంపను కొడితే ఇంకొక చెంపను చూపాలి సర్వోదయ మార్గంలో సమతను సాధించాలి
ఇది కుళ్ళిన సంఘం వయసు మళ్ళిన సంఘం దీని కీళ్ళు విరిచి వేయాలి వేళ్ళు నరికి వేయాలి పెన్ను విడిచి పెట్టి గన్ను చేతపట్టి పెత్తందారుల పచ్చి నెత్తురులో కొత్త జగతి పుట్టాలి
నలుగురిలో కలవు కొన్ని లోపాలు నలుగురిలో కలవు ఎన్నో సుగుణాలు ఈ నలుగురి సుగుణాలు ఏకమైన నాడు ఆదర్శ విద్యార్ధి అవతరించుతాడు అతడే మన దేశానికి ఆశాదీపం విశ్వ శాంతికొసగునోయి అభినవరూపం అతడు శాంతికొసగునోయి అభినవరూపం
Cast: Vinod Kumar, Sukanya, Raghu, Silk Smitha, Costumes Krishna Lyrics: Bhuvanachandra, Rajasri Playback: Mano, Malgadi Subha, Radhika Music: MM Keeravani Cinematography: Babu Producer: Jitendar Director: A. Jagannath Banner: Sri Sowdamini Creators Release Date: 9 September Trivia: This is a remake of Hindi super hit movie KHAL NAYAK.
Comments
విద్యార్ధులు దేశ భావి నిర్ణేతలురా
వినోదాలు చూపినా విప్లవాలు రేపినా
అన్నిటికీ పైచేయి యువతరానిదే
ప్రగతి ఆగిపోవు విద్యార్ధులు ముందు లేనిదే
బుక్స్ బుక్స్ బ్లడీ బుక్స్
లుక్స్ లుక్స్ ప్రెటీ లుక్స్
కారిడార్లో కాసేపు కేంటీన్లో కాసేపు
గర్ల్ ఫ్రండ్స్ తో కాసేపు తిరిగేదే స్టూడెంట్ లైఫ్
గంటలకొద్దీ క్లాస్ రూములో
అంటుకుపోతే ఇరకాటం
ఎపుడో వచ్చే పరీక్షకోసం
ఇపుడే ఎందుకు జంజాటం
చదువేనా ఆహారం
చదువేనా పానీయం
విద్యాదాత నా దైవం
విద్యాలయం నాదేవాలయం
సంఘంతో ముడి లేదు
సమ్మెలతో పనిలేదు
మీటింగులంటే అమ్మో భయం
పాఠాలంటే మహా ప్రియం
సహనం నా కవచం
శాంతం నాకిష్టం
అహింసయే మనజాతికి అందిన పరమార్ధం
ఒక చెంపను కొడితే ఇంకొక చెంపను చూపాలి
సర్వోదయ మార్గంలో సమతను సాధించాలి
ఇది కుళ్ళిన సంఘం వయసు మళ్ళిన సంఘం
దీని కీళ్ళు విరిచి వేయాలి వేళ్ళు నరికి వేయాలి
పెన్ను విడిచి పెట్టి గన్ను చేతపట్టి
పెత్తందారుల
పచ్చి నెత్తురులో కొత్త జగతి పుట్టాలి
చదువులంటే పెదవి విరిచే సరదాజీవి ఒకడు
పుస్తకమే సమస్తమనే చాదస్తపు యువకుడు ఒకడు
వల్లమాలిన సౌజన్యంతో చల్లారిన వాడొకడు
ఉద్యోగంలో ఉనికిని మరచిన ఉగ్రవాది ఇంకొకడు
నలుగురిలో కలవు కొన్ని లోపాలు
నలుగురిలో కలవు ఎన్నో సుగుణాలు
ఈ నలుగురి సుగుణాలు ఏకమైన నాడు
ఆదర్శ విద్యార్ధి అవతరించుతాడు
అతడే మన దేశానికి ఆశాదీపం
విశ్వ శాంతికొసగునోయి అభినవరూపం
అతడు శాంతికొసగునోయి అభినవరూపం
--- సినారె,ఘంటసాల,రంగేళీ రాజా (1971)